మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా ఎరుముల సురేష్
మేడ్చల్, నవంబర్ 10: మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా ఎరుముల సురేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎరుముల సురేష్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎరుముల సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని వారు సూచించారు....