📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాగిల్లాపూర్ లో ఘనంగా బాలల దినోత్సవం

గాగిల్లాపూర్ లో ఘనంగా బాలల దినోత్సవం

📰 Generate e-Paper Clip

గాగిల్లాపూర్ లో
ఘనంగా బాలల దినోత్సవం

గాగిల్లాపూర్ గ్రామ సర్పంచ్ కనకచంద్రం

మద్దూరు నవంబర్14, ప్రజా వాణి,

బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం బాలల ప్రత్యేక గ్రామసభ సర్పంచ్ యిట్టబోయిన కనకచంద్రం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.గ్రామ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ సభకు ఉప సర్పంచ్ గొడుగు బాలరాజు వార్డు సభ్యులు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, సిఏలు, ఆశ వర్కర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్ పాఠశాల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు.

3 ప్రధాన సమస్యలు:*

*1. స్కూల్ ప్రహరీ గోడ లేదు:* పాఠశాలకు వెనుక భాగంలో ప్రహరీ గోడ లేకపోవడంతో బయటి వ్యక్తులు, పశువులు స్కూల్లోకి వస్తున్నాయని, పిల్లల భద్రతకు ముప్పుగా మారిందని తెలిపారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు.

*2. కోతుల బెడద:* స్కూల్ ఆవరణలో కోతుల బెడద విపరీతంగా ఉందని, పిల్లల టిఫిన్ బాక్సులు లాక్కొని, భయపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పిల్లలు ఆటలు ఆడలేకపోతున్నారని అన్నారు.

*3. సోలార్ ఫెన్సింగ్ అవసరం:* కోతులు, ఇతర జంతువులు రాకుండా పాఠశాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యలపై సర్పంచ్ కనక చంద్రం గారు స్పందిస్తూ, ప్రహరీ గోడ నిర్మాణానికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా 5 లక్షలు మంజూరు అయ్యాయని త్వరలో నిర్మిస్తామని, సోలార్ ఫెన్సింగ్ కు జి పి డి పి నిధుల నుండి ప్రతిపాదనలు పంపిస్తామని, కోతుల బెడద నివారణకు అటవీ శాఖ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.
పిల్లలు కూడా తమకు కోతుల బెడద లేకుండా చూడాలని కుక్కలు కూడా ఇబ్బంది పెడుతున్నాయని వాటి నుండి రక్షించడానికి పరిష్కారం వెతకాలని కోరారు.
అనంతరం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.