రైతు సంఘం 36వ జాతీయ మహాసభల జయప్రదంకై బైక్ ర్యాలీ.
సిపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):నల్లగొండ పట్టణంలో అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని
జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి. పిలుపునిచ్చారు.
సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన పట్టణంలో స్థానిక రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొని బైక్ ర్యాలీకి జండా ఊపి ప్రారంభించారు. అనంతరం మోకు కనకారెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ, అనేక రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘనత అఖిల భారత రైతు సంఘానికి ఉందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దున్నేవాడికే భూమి అనే నినాదంతో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి ప్రజల విముక్తికి బాటలు వేసిన ఘనత రైతాంగ ఉద్యమానిదని తెలిపారు.
ఈ మహాసభల జయప్రదంకై జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సుంచు విజేందర్, బి. గణేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, బాల్నే వెంకట మల్లయ్య, కళ్యాణం లింగం, కే. వెంకటేష్, మల్లేష్ రాజ్, ఉపేందర్, యాదగిరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

