📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబూర్గంపహాడ్‌ మండలంలొ గృహ నిర్మాణాల పురోగతికి ప్రశంసలు.

బూర్గంపహాడ్‌ మండలంలొ గృహ నిర్మాణాల పురోగతికి ప్రశంసలు.

📰 Generate e-Paper Clip

బూర్గంపహాడ్‌ మండలంలొ గృహ నిర్మాణాల పురోగతికి ప్రశంసలు.

బూర్గంపహాడ్,
(ప్రజావాణి )
న్యూస్ నవంబర్ 10:

జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో బూర్గంపహాడ్ హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్ ప్రతిభ కనబరిచారు.

సోమవారం హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్‌ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా అభినందించారు.

మండలంలో 675 ఇళ్లు మంజూరు కాగా, వాటి నిర్మాణ పనులు ప్రారంభించి 450 ఇళ్లను పూర్తి చేసినందుకు ఈ సత్కారం దక్కింది. జిల్లాలో ప్రథమ స్థానం సాధించడం మండలానికే గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ కేతిరెడ్డి ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వారాల వేణు, సర్పంచ్ మండా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, ఎడమకంటి సుధాకర్ రెడ్డి, భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.