📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవరంగల్ బీజేపీ నేతలకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గంలో కీలక బాధ్యతలు!

వరంగల్ బీజేపీ నేతలకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గంలో కీలక బాధ్యతలు!

📰 Generate e-Paper Clip

**వరంగల్ బీజేపీ నేతలకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గంలో కీలక బాధ్యతలు!**

వరంగల్ జిల్లా, నవంబర్ 09:
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు కీలక పదవులు లభించాయి. జిల్లా నాయకత్వానికి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత దక్కడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం మహేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మార్టిన్ లూథర్ పోలేపాక, దామెర సదానందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా గరిగే మాధవి నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు సోమవారం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గంట రవికుమార్, కొండేటి శ్రీధర్‌లు నూతన పదాధికారులను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా దళిత సామాజిక వర్గాల్లో బీజేపీ సిద్ధాంతాలు, విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతన పదాధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఎస్సీ మోర్చా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

తమపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి నూతన పదాధికారులు కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాదాసు రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, 14వ డివిజన్ నాయకులు జన్ను ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.