📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదేవరుప్పులలో ఎస్‌ఎస్ జిరాక్స్ సెంటర్ ను ప్రారంభించిన పల్లా సుందర్ రామిరెడ్డి

దేవరుప్పులలో ఎస్‌ఎస్ జిరాక్స్ సెంటర్ ను ప్రారంభించిన పల్లా సుందర్ రామిరెడ్డి

📰 Generate e-Paper Clip

దేవరుప్పులలో ఎస్‌ఎస్ జిరాక్స్ సెంటర్ ను ప్రారంభించిన పల్లా సుందర్ రామిరెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలో పులిగిల్ల సారయ్య ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్ జిరాక్స్ సెంటర్ ను టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు.

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా, చారి మీ సేవా కేంద్రం పక్కన ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రాన్ని పల్లా సుందర్ రామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, పులిగిల్ల సారయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరుప్పుల మండల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. జిరాక్స్, కలర్ ప్రింటింగ్, లామినేషన్, బైండింగ్, ఆన్ లైన్ సేవలు వంటి అన్ని సేవలు ఒకే చోట తక్కువ ధరకే లభించడం మండల ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.

నూతన వ్యాపారంలో పులిగిల్ల సారయ్య మరింత అభివృద్ధి సాధించాలని, నిజాయితీ, నాణ్యతతో ప్రజల నమ్మకాన్ని పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, సుందర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్, తోటకూర కిష్టయ్య, దశరథ, రామచందర్, రాసాల మల్లయ్య, ఐలయ్య, జక్కుల గంగరాజు, పులిగిల్ల సోమ నర్సయ్య, ఎల్లయ్య, వేల్పుల మహేష్, మీడియా మిత్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.