📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

📰 Generate e-Paper Clip

*ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు*

*లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్*

*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ*

షాద్ నగర్ నవంబర్ 08(మన ప్రజా వాని )

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు. కొత్తగా నిర్మించుకున్న ఇళ్లలో లబ్ధిదారులు తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న వేళ వారితో కలిసి పండుగ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి పేద కుటుంబం జీవితంలో సంతోషం, వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, వైస్ చైర్మన్ అందే మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింది తిరుపతిరెడ్డి, జమ్రుద్ ఖాన్, ముబారక్ అలీ ఖాన్, ఇబ్రహీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, కౌన్సిలర్లు జంగయ్య, సాదిక్, లయక్, బీరప్ప, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.