📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమహిళల ఆరోగ్యానికి మహి & ఐకాన్ అండ

మహిళల ఆరోగ్యానికి మహి & ఐకాన్ అండ

📰 Generate e-Paper Clip

మహిళల ఆరోగ్యానికి మహి & ఐకాన్ అండ
• ఆడబిడ్డ ఆరోగ్యమే.. ఇంటి ఆనందానికి ఆధారం
• కమలాపూర్‌లో ఉచిత మహిళా వైద్య శిబిరం

ప్రజావాణి శాయంపేట,

ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమించే మహిళలు.. తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దనే సందేశంతో మహి & ఐకాన్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రత్యేకంగా మహిళల కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించింది. టి.బి.సి. చర్చి కమలాపూర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా మహిళా వైద్య శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.
మహి & ఐకాన్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ పి. రజిని మహిళలతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. మహిళల్లో తరచుగా కనిపించే ఆరోగ్య సమస్యలు, వాటికి గల కారణాలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమస్యలను సైతం వైద్యులతో స్వేచ్ఛగా పంచుకోవాలని, ఆరోగ్య సమస్యలను దాచిపెట్టకుండా సకాలంలో చికిత్స తీసుకోవాలని సూచించారు.
మహిళల ఆరోగ్యానికి వైద్యం మాత్రమే కాదు.. భరోసా కూడా అవసరం అన్న రీతిలో మహి & ఐకాన్ వైద్య బృందం మహిళలకు అందుబాటులో ఉండి వారి సందేహాలను నివృత్తి చేసింది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డాక్టర్ రజిని తెలిపారు.
మహిళలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలను ఓపికగా తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు అందించడం పట్ల శిబిరానికి వచ్చిన మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల మహిళలకు చేరువ చేయడం అభినందనీయమని చర్చి నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహి & ఐకాన్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ మేనేజర్ ఎం. సృజన్, డాక్టర్ జ్యోతి, వైద్య సిబ్బంది, టి.బి.సి. చర్చి చైర్మన్ జాన్ వెస్లీ, అధ్యక్షుడు నవీన్, సభ్యులు, సంఘస్తులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన మహి & ఐకాన్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ యాజమాన్యానికి మహిళలు, చర్చి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.