సీతారామపురంలో సీఎం జన్మదిన వేడుకలు
ప్రజావాణి,: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సీతారామపురం లో సర్పంచి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.సర్పంచి భాస్కర్, మాజీ ఉపసర్పంచి వేల్పుల మల్లయ్య, సీనియర్ నాయకులు ఎల్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు
,మరో 10 సంవత్సరాలు సీఎంగా రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు బస్సు ఫ్రీ, గృహాలకు 2 యూనిట్లు ఉచిత విద్యుత్తు,సన్న బియ్యం, రేషన్ కార్డుల మంజూరు తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముఖ్యమంత్రి ప్రజా నేతగా మన్ననలు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

