*కొత్తగూడలో అత్యంత వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*
కొత్తగూడ మండల ప్రతినిధి:- నవంబర్ 08. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అలాగే కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. యువజన విభాగం (యూత్ కమిటీ) అధ్యక్షుడు చొప్పరి కుమార్ నాయకత్వంలో నిర్వహించిన, ఈ కార్యక్రమం లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ రూపుసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన ఘనంగా కేక్ కట్ చేసి, అందరికీ మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బానోత్ రూప్ సింగ్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 57వ, పుట్టిన రోజు సందర్బంగా సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతోందని కొనియాడారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించేలా భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించిన యూత్ కమిటీ అధ్యక్షుడు చొప్పరి కుమార్ అలాగే వారి బృందాన్ని ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమం లో యూత్ కమిటీ అధ్యక్షుడు చొప్పరి కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తామని అన్నారు. అనంతరం ఒకరికొకరు తీపి తినిపించుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్య, బ్లాక్ అధ్యక్షుడు సుంకర బోయిన మొగిలి, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణ రెడ్డి, మండల అధికార ప్రతినిధి ఇర్ప రాజేశ్వర్, బిట్ల శ్రీనివాస్, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు సర్పంచ్ లు, పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరు పాల్గొన్నారు.

