*తాటి చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు*
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని వేడుకోలు
ముస్తాబాద్, ప్రజావాణి
తాటి చెట్టు పై నుండి ప్రమాదశాత్తు కాలు జారీ కింద పడ్డ ఘటన తుర్కపల్లి లో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన వేముల నారాయణ తుర్కపల్లి గ్రామంలో తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. నారాయణది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని పలువురు కోరుతున్నారు.

