*ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*
ప్రజావాణి శాయంపేట
మండలం మందారిపేట గ్రామంలో వల్లెపు శోభా దేవి దిలీప్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, ఒక పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భరోసా కల్పించే సొంత చిరునామా అని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పానికి ఇందిరమ్మ ఇళ్లు నిదర్శనమని అన్నారు.
ఈ దీపావళి పండుగ ప్రతి ఇంటా సంతోషాలు, సిరిసంపదలు, ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

