📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎమ్మెల్యే కడియం శ్రీహరి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గుడి వంశీధర్ రెడ్డి

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గుడి వంశీధర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గుడి వంశీధర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08 (ప్రజావాణి): దీపావళి పండుగను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ని మర్యాదపూర్వకంగా ఆదివారం కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్లు పంచుకుంటూ ఆత్మీయంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, దీపావళి అంటే చీకటిపై వెలుగు విజయానికి ప్రతీక అని, అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజల మధ్య ఆత్మీయత, స్నేహభావం పెంపొందడానికి పండుగలు గొప్ప వేదికలని అన్నారు.

అనుభవజ్ఞులైన నాయకులు, మాజీ మంత్రి కడియం శ్రీహరి మార్గదర్శకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కలిసి పని చేస్తామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో, పెద్దల సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.