📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసొంతింట్లో వెలిగిన దీపావళి దీపాలు.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సంబరాలు.. సర్పంచ్ బిల్లా యాదగిరి...

సొంతింట్లో వెలిగిన దీపావళి దీపాలు.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సంబరాలు.. సర్పంచ్ బిల్లా యాదగిరి సందడి

📰 Generate e-Paper Clip

**సొంతింట్లో వెలిగిన దీపావళి దీపాలు.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సంబరాలు.. సర్పంచ్ బిల్లా యాదగిరి సందడి!**

హనుమకొండ జిల్లా, వేలేరు మండలం:
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సహకారంతో మొదటి విడతలో మంజూరైన 52 ఇందిరమ్మ ఇళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లలో సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. లబ్ధిదారులతో కలిసి టపాసులు కాల్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడతలో కూడా వేలేరు గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు త్వరలో మంజూరవుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తమ సొంతింటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, వార్డు సభ్యులు, ఆత్మ డైరెక్టర్ చంద్రమౌళి, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.