📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలింగంపల్లిలో ఘనంగా అలైబలై కార్యక్రమం

లింగంపల్లిలో ఘనంగా అలైబలై కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*లింగంపల్లిలో ఘనంగా అలైబలై కార్యక్రమం*

*కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలి – విఆర్ వన్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి*

మంచాల, నవంబర్ 7 (ప్రజావాణి):

మంచాల మండలం లింగంపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో విఆర్ వన్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచాల మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులను వేదికపైకి ఆహ్వానించి, ప్రతి ఒక్కరినీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. కళాకారుల ఆటపాటలతో అలైబలై వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ బి. నాగేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాల గొప్పతనాన్ని వివరించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసి మెలిసి ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

విఆర్ వన్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అలైబలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ మన మధ్య ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మంచాల మండలంలోని ప్రతి గ్రామంలో విఆర్ వన్ ఫౌండేషన్ ద్వారా పార్టీ నాయకులు. ఫౌండేషన్. ఆర్గనైజర్లు. పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.