📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసిద్దూర్ అభివృద్ధికి మరో ముందడుగు

సిద్దూర్ అభివృద్ధికి మరో ముందడుగు

📰 Generate e-Paper Clip

*సిద్దూర్ అభివృద్ధికి మరో ముందడుగు!*

*మహిళా సమాఖ్య భవనం, వివో షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్*

*గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ మాలేపు దుర్పతిబాయి (సుధాకర్) ప్రత్యేక చొరవ.. మహిళా సంఘాల బలోపేతానికి నూతన భవనాలు దోహదం చేస్తాయన్న ఎమ్మెల్యే*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 7:-
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు చేపడుతున్న కార్యక్రమాలకు మరో నిదర్శనంగా భైంసా మండలంలోని సిద్దూర్ గ్రామంలో మహిళా సమాఖ్యకు నూతన భవనం (వీఓ బిల్డింగ్), వివో షెడ్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనం, షెడ్‌ను ప్రారంభించారు. గ్రామంలో మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో సర్పంచ్ మాలేపు దుర్పతి బాయి (సుధాకర్) చొరవ ప్రత్యేకంగా నిలిచింది. మహిళా సంఘాల కార్యకలాపాలకు శాశ్వత వేదిక కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామ మహిళల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గ్రామాభివృద్ధితో పాటు మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ సర్పంచ్, సుధాకర్ ముందుకు సాగడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి, సమావేశాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఇటువంటి భవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మహిళలు సంఘటితంగా ఉంటూ స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ మాలేపు దుర్పతి బాయి (సుధాకర్), ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.