నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు
– కుల్కచర్లలో ‘న్యాక్’ ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత కోర్సులు
– ఉచిత వసతి, భోజనం.. పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు
పరిగి /కుల్కచర్ల నవంబర్ 07(ప్రజావాణి )
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ అన్వర్ బీస్ మహమూద్ వెల్లడించారు. పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ నైపుణ్య శిక్షణకు అర్హులని తెలిపారు. మూడు నెలల పాటు కొనసాగే ఈ కోర్సుల కాలంలో అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి, భోజనం, అవసరమైన స్టడీ మెటీరియల్, స్టేషనరీని ఉచితంగా అందజేస్తామన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు (ప్లేస్‌మెంట్స్) కల్పిస్తామని స్పష్టం చేశారు.
శిక్షణ అందించే ప్రధాన కోర్సులు:
క్వాలిటీ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ ఎలక్ట్రీషియన్, డొమెస్టిక్ సర్వీస్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్ వర్క్స్), ప్లంబర్ జనరల్, జూనియర్ స్టోర్ కీపర్, మల్టీ స్కిల్ టెక్నీషియన్, వెల్డర్, సోలార్ PV ఇన్‌స్టాలర్, MEP టెక్నీషియన్, షట్టరింగ్ కార్పెంటర్, ట్రెడిషనల్ పెయింటింగ్, మేకర్ ఆర్టిసన్, మొబైల్ ఫోన్ హార్డ్‌వేర్ రిపేర్ టెక్నీషియన్.
* అర్హత: 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత / చదివిన వారు.
* వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాలు.
దరఖాస్తు & సంప్రదింపుల కోసం:
ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్‌లోని కొత్తగూడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులను సంప్రదించవచ్చు:
* అసిస్టెంట్ డైరెక్టర్ (హైదరాబాద్): 9177154210
* హనుమప్ప: 9032504507
* శంకర్: 8008937800
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. కామేశ్వరి, అసిస్టెంట్ డైరెక్టర్ అన్వర్ బేస్ మొహమ్మద్, ప్రతినిధులు హనుమప్ప, శంకర్ ప్రసాద్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాంకేతిక నైపుణ్యాలతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

