📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర విమర్శలు

కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర విమర్శలు

📰 Generate e-Paper Clip

అమరావతి: నవంబర్ 07ప్రజావాణి భారతదేశానికి  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యపాలు అయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సామాన్య ప్రజల హక్కులకు కాలరాస్తూ,దౌర్జన్యాలు,అక్రమాలకు తెరలేపిందని ఆయన ఘాటుగా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగార్జున రెడ్డి ప్రకటనలోని

బీహార్,యూపీ మాఫియా సంస్కృతిని మించిపోయిన దౌర్జన్యాలు

గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ (యూపీ) రాష్ట్రాలలో మాఫియా చేతుల్లో దౌర్జన్యాలు,అక్రమాలు జరుగుతాయని వినేవాళ్లమని,కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను మించిపోయేలా అరాచకాలు సాగుతున్నాయని మండిపడ్డారు. స్థానిక మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు, జడ్పీటీసీ,ఎంపీటీసీ పరిషత్ ఎన్నికల సరళిని చూస్తే అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడం,దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసుల సమక్షంలోనే అక్రమాలు వన్ సైడ్ రూలింగ్ఈ అరాచకాలన్నీ పోలీస్ అధికారుల సమక్షంలోనే జరుగుతున్నా,శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే కళ్ళులేని కబోదుల్లాగా వ్యవహరిస్తున్నారని నాగార్జున రెడ్డి ఆరోపించారు. ఒకవైపు దాడులకు గురవుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపైనే తిరిగి అక్రమ కేసులు బనాయించి, వారిని జైలుకు పంపడం దారుణమన్నారు. ఎలక్షన్ కమిషన్,పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా మారి ఏకపక్షంగా (వన్ సైడ్) వ్యవహరిస్తున్న తీరు దేశ చరిత్రలోనే ఎక్కడా,ఏ రాష్ట్రంలోనూ జరగలేదని స్పష్టం చేశారు.

పులివెందులలో భయానక వాతావరణం – ఏకే 47తో బెదిరింపులు

పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జరిపిన దౌర్జన్యకాండ,దహనకాండ అత్యంత హేయమైనవని ఆయన పేర్కొన్నారు.బయటి ప్రాంతాల నుండి రౌడీలను రప్పించి ఇక్కడ అరాచకాలు చేయించారని,ఆపై మళ్లీ వైఎస్సార్‌సీపీ నాయకులు సుమారు 1000 మందిపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కనిపించిన వారిని కనిపించినట్లు అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు.అక్కడ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏకే 47 తుపాకులతో సామాన్య ప్రజలను బెదిరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు.

మౌనంగా ఉన్న మోదీ, అమిత్ షా.విశ్వాసం కోల్పోయిన బీజేపీ, జనసేన

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉందని, కానీ నేడు రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను నేషనల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారని నాగార్జున రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా గానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దౌర్జన్యకాండపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ అక్రమాలపై నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. జనసేన అభ్యర్థులపైనే టీడీపి రెబెల్స్ పోటీ చేసి వారిని ఓడించినా పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు.

నాడు జగన్ పాలనలో సక్రమంగా ఎన్నికలు నేడు ఓటు వేయలేని పరిస్థితి

గతంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత సక్రమంగా, పారదర్శకంగా జరిగాయని గుర్తు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని,ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఉన్న ఓటు హక్కును సామాన్యులు సైతం వినియోగించుకోలేని భయానక వాతావరణాన్ని సృష్టించారని, దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి: వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు పిలుపు

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగబోతున్నాయని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎవరైతే సర్పంచ్ అయితే బాగుంటుందో ఆయా గ్రామాల ప్రజలే నిర్ణయిస్తారని, కావున వైఎస్సార్‌సీపీ క్యాడర్,నాయకులు అందరూ ఈ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి బలం బాగా పెరిగిందని, అందువల్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తన సత్తా చాటాలని కోరారు.నిర్దిష్ట సామాజిక వర్గంపై అణిచివేత కుట్ర కర్మ సిద్ధాంతం ఎవరినీ వదలదు రాయలసీమ,ప్రకాశం,నెల్లూరు మరియు గుంటూరు ప్రాంతాల్లో ఉన్న ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందిన నాయకులను అణచివేయడానికి,ఆ వర్గాన్ని అన్ని విధాలా దెబ్బతీయడానికి అధికార పార్టీ పెద్ద కుట్ర పన్నిందని నాగార్జున రెడ్డి ఆరోపించారు.ఈ విషయాన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన మేధావులు, విశ్లేషకులు, సీనియర్ నాయకులు సైతం బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారని తెలిపారు.చివరగా ఆయన హెచ్చరిస్తూ.”మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు దౌర్జన్యాలు చేసిన కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వారే ఆలోచించుకోవాలి” అని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదలదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు అక్రమాలకు సపోర్ట్ చేసిన వారు ఎవరూ కూడా భవిష్యత్తులో కాపాడటానికి రారని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.