📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కాశీనాయన మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఘన విజయోత్సవం: ఘన స్వాగతం పలికిన ప్రజలు

కాశీనాయన మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఘన విజయోత్సవం: ఘన స్వాగతం పలికిన ప్రజలు

📰 Generate e-Paper Clip

కాశీనాయన (కడప జిల్లా),నవంబర్ 08 ప్రజావాణి  కాశీనాయన: ఇటీవల జరిగిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన విజయం సాధించిన కాశినాయన మండల ఎంపీపీ కర్నాటి వెంకటరెడ్డి,జెడ్పీటీసీ సభ్యురాలు ఆర్ల ఓబులమ్మ,ఆమె కుమారుడు ఆర్ల చంద్రయాదవ్‌లకు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు.విజయానంతరం తొలిసారి మండలంలో పర్యటించిన వీరికి మిద్దెల,గంగనపల్లి,చిన్నాయపల్లి గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.మంగళ వాయిద్యాలు,డప్పు చప్పుళ్లు,బాణసంచా పేలుళ్లతో వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.గెలిచిన ప్రజాప్రతినిధులను పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.తమ విజయం కాశీనాయన మండల ప్రజల విజయమని, తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఎన్నికల్లో సాధించిన ఈ భారీ విజయం పట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.