📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవెంకటేశ్వర మోటార్ బైక్ హబ్ ఆధ్వర్యంలో ఘనంగా లక్కీ డ్రా.. విజేతలకు బహుమతుల ప్రదానం

వెంకటేశ్వర మోటార్ బైక్ హబ్ ఆధ్వర్యంలో ఘనంగా లక్కీ డ్రా.. విజేతలకు బహుమతుల ప్రదానం

📰 Generate e-Paper Clip

వెంకటేశ్వర మోటార్ బైక్ హబ్ ఆధ్వర్యంలో ఘనంగా లక్కీ డ్రా.. విజేతలకు బహుమతుల ప్రదానం

హసన్‌పర్తి, (మన ప్రజావాణి):

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని వెంకటేశ్వర మోటార్ బైక్ హబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు.

లక్కీ డ్రాలో మొదటి బహుమతిని ఎటూరునాగారానికి చెందిన కోర్నబెల్లి గణేష్ గెలుచుకోగా, రెండవ బహుమతిని హసన్‌పర్తికి చెందిన ఆరెపల్లి సృజన కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతి బి. విజయకు దక్కింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ శివకుమార్, 66వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, పిట్టల కుమారస్వామి, కందుకూరి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగల సందర్భంగా వినియోగదారుల కోసం లక్కీ డ్రా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.