*ముగిసిన రాష్ట్రీయ ఏక్తా దివస్ – 2026 వేడుకలు – నల్గొండ జిల్లా బృందాన్ని అభినందించిన కలెక్టర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలకు నోడల్ ఆఫీసర్ గా నియమించబడిన మహమ్మద్ అక్బర్ అలీ మాట్లాడుతూ… నల్గొండ జిల్లా నుండి కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మంత్రి *కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనల మేరకు వివిధ రంగాల నుండి 15 మందిని ఎంపిక చేసి, నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ అలీ ఆధ్వర్యంలో గుజరాత్ లో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ లో పాల్గొని, దేశం నలుమూలల నుంచి వచ్చిన సాంస్కృతిక శకటాలను వీక్షించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ బృందం తమ అమూల్యమైన సేవలను అందించారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా నుంచి బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తీసుకువెళ్లడం, టిఫిన్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, వాటర్ వంటి సౌకర్యాలతో పాటు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులకు వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తమ అమూల్యమైన పాత్రను పోషించారు. తమకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకొని వేడుకలలో విజయవంతంగా పాల్గొన్న ఈ 15 మంది బృందాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ నల్గొండ జిల్లా మహ్మద్ అక్బర్ ఆలీ, నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటయ్య, నల్గొండ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆవుల మాధవి,
చినకపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, జాప్తివీరప్ప గూడెం గ్రామ సర్పంచ్ వెంకటయ్య, ఇసుకబావి గూడెం గ్రామ సర్పంచ్ కల్లూరి అనిత, కొప్పోల్ గ్రామ సర్పంచ్ ఙ్ఞానలత , వెంకటరెడ్డి, జెడ్ ఎస్ పెట్రోల్ బంక్ మేనేజర్ సంధ్యారాణి, పేపర్ ప్రొడక్ట్స్ మేనేజర్ మెండే పార్వతమ్మ, మైనంపల్లి గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాల నుంచి కె తరుణ్ విద్యార్థి, నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ యం సాయి పవన్ విద్యార్థి, కె పి యం జూనియర్ కళాశాల ఎస్ హర్షిత్, టి జి యం గుర్రంపాడు ఆర్ చైతన్య, తదితరులు పాల్గొనడం జరిగింది.

