📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅర్ధశతాబ్ది ఉద్యమానికి 'వేం' అండ!

అర్ధశతాబ్ది ఉద్యమానికి ‘వేం’ అండ!

📰 Generate e-Paper Clip

*అర్ధశతాబ్ది ఉద్యమానికి ‘వేం’ అండ!*

అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవాలకు నరేందర్ రెడ్డికి ఆహ్వానం.

కేసముద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ.

రూ.1.50 కోట్లతో నిర్మాణ పనులు.. పూర్తిస్థాయిలో భవనం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం.

కేసముద్రం నవంబర్04,ప్రజావాణి.

ఐదు దశాబ్దాల సామాజిక చైతన్య ప్రస్థానం.. అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతర పోరాటం.. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. సంఘం 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న 50వ వసంత వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని ఆహ్వానించింది. ఇదే సందర్భంలో కేసముద్రంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవనం పూర్తికి సహకరించాలని నాయకులు చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం కేసముద్రం మండల అధ్యక్షుడు వల్లందాస్ రవి ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. సంఘం ఐదు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, అంబేద్కర్ ఆలోచనా విధానం, సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన ఉద్యమాలను వివరించారు. స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులు మంజూరైనట్లు నాయకులు వివరించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తన సొంత నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించి కలెక్టర్ పరిధికి పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ అనంతరం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే మరిన్ని నిధులు అవసరమవుతాయని నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు తన వంతు సహాయ సహకారాలు, మద్దతు అందిస్తానని భరోసా ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. భవనం పూర్తయితే అంబేద్కర్ ఆశయాల ప్రచారానికి, సామాజిక చైతన్య కార్యక్రమాలకు, యువత సమావేశాలకు శాశ్వత వేదికగా నిలవనుంది.సంఘం అర్ధశతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి రాష్ట్ర వ్యవస్థాపకులు ఇండియన్ ఇన్ఫర్మేషన్ జేబీ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు చిప్పలపల్లి అవిలయ్య, జనరల్ సెక్రటరీ బొమ్మెర్ల నాగరాజు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు, ఉపాధ్యక్షుడు మందల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నీరుడు సామేలు, మండల అధ్యక్షుడు వల్లందాస్ రవి, సంఘం ముఖ్య సలహాదారుడు, వివిధ గ్రామాల సర్పంచులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.సీనియర్ నాయకులు మాంకల కట్టమల్లు, పోలేపాక నాగరాజు, పందుల సంజీవ, వల్లందాస్ కృష్ణ, కందుకూరు ఉపేందర్, తాళ్లపూసపల్లి సర్పంచ్ కొమ్ము వెంకన్న, సోమారపు శ్రీరాములు, నాగేల్లి శ్రీనివాస్, కేసముద్రం పట్టణ అధ్యక్షుడు జల్లంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మిట్టగడుపుల యాకయ్య, వల్లందాస్ దేవదానం, జల్లే యాకాంబరం, మునిగే చినబాబు, జల్లే రవీందర్, పాల్వాయి మల్లేష్, మిట్టగడుపుల యాకూబ్, పోలేపాక కమలాకర్, ఇసంపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.