*మంచాల రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ బాగోతం!*
*రైస్ మిల్ ఓనర్ శ్రీకాంత్ రెడ్డి*
*పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం సాగుతోందా? 19 బ్రాండ్ల పేర్లతో విక్రయాల వెనుక ఎవరున్నారు?*
*100 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యం గుర్తింపు.. దందా వెనుక అసలు సూత్రధారులు ఎవరు?*
*విజిలెన్స్ తనిఖీలతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం.. పూర్తిస్థాయి విచారణకు ప్రజల డిమాండ్*
మంచాల, నవంబర్ 5 (ప్రజావాణి):
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కొందరికి అక్రమ ఆదాయ వనరుగా మారుతోందా? పేదలకు చేరాల్సిన ప్రభుత్వ బియ్యం రైస్ మిల్లులకు చేరి, అక్కడ రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా వివిధ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి వెళ్తోందా? మంచాల మండలంలోని శ్రీ రామేశ్వర్ రైస్ మిల్లుపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికారుల తనిఖీల్లో 100 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రేషన్ బియ్యం గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా 19 బ్రాండ్ల పేర్లతో బియ్యం విక్రయిస్తున్న వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా మిల్లుకు చేరింది? రేషన్ బియ్యాన్ని సేకరించి వ్యాపారంగా మార్చుతున్నది ఎవరు? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి.
రేషన్ బియ్యం మిల్లుకు ఎలా చేరుతోంది?
ప్రభుత్వం పేద కుటుంబాలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం లబ్ధిదారుల నుంచి సేకరించి అక్రమంగా మిల్లులకు తరలిస్తున్నారా? గ్రామస్థాయిలో ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నది ఎవరు? రవాణా చేసేందుకు సహకరిస్తున్నది ఎవరు? మిల్లులో నిల్వ ఉంచిన బియ్యం ఏ ప్రాంతాల నుంచి వచ్చింది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
19 బ్రాండ్ల పేర్లతో విక్రయాల వెనుక అసలు కథేంటి?
20 నుండి రకాల ప్రముఖ బ్రాండ్ల ఖాళీ సంచుల్లో నింపి సరికొత్త ప్యాకేజీతో మార్కెట్లోకి తరలిస్తున్నట్లు తనిఖీలు నిర్ధారణ అయింది.


