📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం: మంత్రి పి. నారాయణ

పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం: మంత్రి పి. నారాయణ

📰 Generate e-Paper Clip

పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం: మంత్రి పి. నారాయణ

మంత్రి నారాయణకు స్వాగతం పలికిన మంత్రి సవితమ్మ

మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపిన మంత్రి నారాయణ

అనంత పురం బ్యూరో నవంబర్ 04 ప్రజా వాణి
పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ బుధవారం పెనుకొండలోని మంత్రి సవితమ్మ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుతో పాటు కౌన్సిలర్లను ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతి వార్డులోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం మంత్రి సవితమ్మతో కలిసి రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కార్యాచరణపై సమాలోచనలు జరిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు, ఎన్నికల పరిశీలకులు సోమశెట్టి వెంకటేశ్వర్లు, పెనుకొండ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.