📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణర్యాపిడో, ఉబర్‌ ప్రభావంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి.. తోటి డ్రైవర్ మృతికి సంతాపంగా ఆటోల...

ర్యాపిడో, ఉబర్‌ ప్రభావంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి.. తోటి డ్రైవర్ మృతికి సంతాపంగా ఆటోల బంద్

📰 Generate e-Paper Clip

ర్యాపిడో, ఉబర్‌ ప్రభావంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి.. తోటి డ్రైవర్ మృతికి సంతాపంగా ఆటోల బంద్!

హసన్‌పర్తి, నవంబర్ 4 (మన ప్రజావాణి):

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన తోటి ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ అనారోగ్యంతో ఈరోజు (04-11-2026) మృతి చెందడం పట్ల హసన్‌పర్తి మన తెలంగాణ ఆటో యూనియన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా బుధవారం హసన్‌పర్తి మండలంలో ఆటోల బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే ర్యాపిడో, ఉబర్ వంటి ఆన్‌లైన్ రవాణా సేవల ప్రభావంతో సంప్రదాయ ఆటో డ్రైవర్లకు ప్రయాణికులు తగ్గి, ఆదాయం పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పోటీతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు.

తోటి ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

హసన్‌పర్తి మండలంలోని ఆటో డ్రైవర్లందరూ బంద్‌కు సహకరించి, తోటి డ్రైవర్‌కు నివాళులర్పించాలని మన తెలంగాణ ఆటో యూనియన్ నాయకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.