సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి
బెజ్జంకి, నవంబర్ 4 (ప్రజావాణి)
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి సూచించారు.సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా బుధవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆన్‌లైన్ ప్రకటనల పేరుతో వస్తువులు,సేవలు అందిస్తామని డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడటం,క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను దొంగిలించడం, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి ప్రజలను మోసం చేయడం వంటి సైబర్ నేరాలపై వివరిస్తూ,మీ డబ్బు.. మీ క్లిక్.. మీ ఎంపిక అనే నినాదంతో ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్సై తోట తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

