📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యావంతుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం.. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గంట రవికుమార్ పిలుపు!

విద్యావంతుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం.. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గంట రవికుమార్ పిలుపు!

📰 Generate e-Paper Clip

**విద్యావంతుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం.. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గంట రవికుమార్ పిలుపు!**

హనుమకొండ:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుల భాగస్వామ్యం కీలకమని, ప్రతి అర్హుడైన గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వైద్యులు తమ సామాజిక బాధ్యతగా ఓటు హక్కును పొందాలని ఆయన సూచించారు.

ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ క్లబ్ ఆవరణలో డెంటల్ డాక్టర్ల కోసం ప్రత్యేక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యావంతులు, మేధావులు, వృత్తి నిపుణుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజానికి సేవలందించే వైద్యులు రాజకీయ, ప్రజాస్వామ్య ప్రక్రియల్లోనూ భాగస్వాములు కావాలని అన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హత కలిగిన ప్రతి డెంటల్ డాక్టర్ ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

విద్యావంతుల అభిప్రాయాలకు, వృత్తి నిపుణుల భాగస్వామ్యానికి ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ, ఓటరు నమోదు ప్రక్రియను విస్తృత స్థాయిలో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మారెడ్డి, రత్నం సతీష్ షా, హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు దంత వైద్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

విద్యావంతుల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుంది. ప్రతి అర్హుడైన గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును పొందడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలనే సందేశంతో ఈ కార్యక్రమం కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.