📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఇంటింటికి వెళ్లి ఓటు నమోదు చేయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి ఓటు నమోదు చేయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి ఓటు నమోదు చేయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): రాబోయే ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది.

గురువారం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు పలువురు పట్టభద్రుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి వివరాలను సేకరించారు.
అనంతరం స్థానిక సర్పంచ్ సునీత వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఓటు నమోదు కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఓటు నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించి, పట్టభద్రులచే ఓటు నమోదు పూర్తి చేయించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
ప్రతి పట్టభద్రుడు తన ఓటును నమోదు
చేసుకోవడం చాలా
అవసరం. పట్టభద్రుల ఓటు సాధారణ ఓటు
కాదు, అది రాష్ట్ర
భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం.
విద్యావంతులైన
యువత ఆలోచించి ఓటు వేస్తేనే
ప్రజాస్వామ్యం
బలపడుతుందని,
కాంగ్రెస్ ప్రభుత్వం
ఇచ్చిన హామీలను
విస్మరించి ప్రజావ్యతిరేక
విధానాలతో
ముందుకు
వెళుతోందని,
నిరుద్యోగ యువతను,
పట్టభద్రులను
మోసం చేస్తోందని,
కాబట్టి రాబోయే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్
ప్రభుత్వానికి బుద్ధి
చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ
మెజారిటీతో
గెలిపించాలని
పట్టభద్రులను
కోరుతున్నాను.
అని అన్నారు.

అమ్మాపురం గ్రామంలోని ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి ఓటు నమోదుపై అవగాహన కల్పించాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని సర్పంచ్ సునీత వీరారెడ్డి కి, స్థానిక నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ బొమ్మేరా భాషా, గట్టు నవీన్, కోటగిరి కృష్ణమూర్తి, పస్రం శ్రీను, గంధం అశోక్, వడ్లకొండ మమత, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.