దాచారం సర్పంచ్ బైరా మానస రాజేందర్
బెజ్జంకి, నవంబర్ 4 (ప్రజావాణి)
పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారమవుతోందని దాచారం గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ అన్నారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో తపేట మమత–మల్లేశం దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరా మానస రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేస్తున్నందుకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, సర్పంచ్ బైరా మానస రాజేందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీటి బాలనర్సు, వార్డు సభ్యులు అశోక్, మహేష్, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్, చంద్రయ్య, రాజేశం, సత్తయ్య, దీటి రాజు, పోచయ్య, ఎల్లయ్య, తిరుపతి, రాములు, రాజయ్య, పరశురాములు, మొండయ్య, నర్సయ్య, బాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

