📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు.

కిలో బీపీటీ రూ.66,సోనా రూ.74,హెచ్‌ఎండీటీ రూ.79 మించరాదు.

కోటగిరి,పోతంగల్ ఎమ్మార్వోలు గంగాధర్,సందీప్.

ప్రతి 26 కేజీల బస్తాపై ఎమ్మార్పీ ముద్రణ తప్పనిసరి.

బోధన్ సివిల్ సప్లై డీటీ హనుమంతు.

నిబంధనలోని సందేహాలపై స్పష్టత ఇస్తే ప్రభుత్వానికి 100 శాతం సహకరిస్తాం.

రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ పటేల్.

కోటగిరిలో రైస్ మిల్లర్లతో ఎమ్మార్వోలు,డిటి ప్రత్యేక సమావేశం.

కోటగిరి/ప్రజావాణి:-ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కోటగిరి,పోతంగల్ మండలాల ఎమ్మార్వోలు గంగాధర్, సందీప్,బోధన్ సివిల్ సప్లై డీటీ హనుమంతు స్పష్టం చేశారు.సామాన్య ప్రజలకు న్యాయమైన ధరలకు బియ్యం అందించడంతో పాటు ధరల నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.మంగళవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండ ల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో కోటగిరి,పోతంగల్ మండలాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.బియ్యం ధరల నియంత్రణ, ఎమ్మార్పీ అమలు,వినియోగదారులకు న్యాయమైన ధరలకు బియ్యం అందించే అంశాలపై అధికారుల బృందం మిల్లర్లకు దిశానిర్దేశం చేసింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం బీపీటీ/కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66,ఆర్ఎన్ఆర్/తెలంగాణ సోనా రకం కిలో రూ.74,హెచ్‌ఎంటీ/జేఎస్ఆర్ రకం కిలో రూ.79కు విక్రయించాలని తెలిపారు.ఇవే తుది వినియోగ దారులకు వర్తించే గరిష్ఠ విక్రయ ధరలని పేర్కొన్నారు.నిర్ణ యించిన ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బ్రాండ్ పేరుతోనో,ప్యాకింగ్ నాణ్యత పేరు తోనో ఒకే రకం బియ్యాన్ని అధిక ధరకు విక్రయించడం అనుమతించబడదని స్పష్టం చేశారు.ప్రతి 26 కిలోల బియ్యం బస్తాపై ఎమ్మార్పీని తప్పనిసరిగా ముద్రించాలని మిల్లర్లకు సూచించారు.ప్రతి మిల్లు,డిపో,టోకు,చిల్లర దుకాణం వద్ద ధరల వివరాలతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రైస్ మిల్లుల ఆవరణలోనే రిటైల్ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్దేశిత ధరలకు నేరుగా ప్రజలకు బియ్యం విక్రయించాలని సూచించారు.ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని తెలిపారు. బియ్యం నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ధరల నియంత్రణ నిబంధనలు అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు సివిల్ సప్లై,లీగల్ మెట్రాలజీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు,సీఐడీ,పోలీసు శాఖల సమన్వయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.వినియోగదారుల నుంచి అధిక ధరలపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలపై మిల్లర్ల సందేహాలు.ఈ సమావేశంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల అమలుపై పలు సందేహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.నాన్ ట్రేడింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ధరలకు బియ్యం విక్రయించవచ్చా,ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే బియ్యానికి కూడా ఇదే ధరల నిబంధనలు వర్తిస్తాయా,ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాత నిల్వలకు ఏమైనా వెసులుబాట్లు ఉన్నాయా అనే అంశాలపై స్పష్టత కోరారు.అదేవిధంగా బియ్యం బస్తాల పరిమాణం,రంగు, ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించిన నిబంధనలపై కూడా వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.నిబంధనలపై ఉన్న సందేహాలను అధికారులు స్పష్టంగా తెలియజేస్తే ప్రభుత్వానికి 100 శాతం సహకారం అందిస్తామని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ పటేల్ తెలిపారు.
దీనిపై స్పందించిన ఎమ్మార్వోలు,సివిల్ సప్లై డీటీ సంబంధిత సందేహాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పష్టమైన వివరణ అందిస్తామని తెలిపారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ వినియోగదారులకు న్యాయమైన ధరలకు బియ్యం అందించేందుకు మిల్లర్లు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో ఎంపీడీవో చందర్ నాయక్,కోటగిరి,పోతంగల్ మండలాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు,రెవెన్యూ,పోలీస్,సివిల్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.