📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalపాపయ్యపేటలో ఉచిత పశువైద్య శిబిరం:పశువులకు పరీక్షలు, మందుల పంపిణీ

పాపయ్యపేటలో ఉచిత పశువైద్య శిబిరం:పశువులకు పరీక్షలు, మందుల పంపిణీ

📰 Generate e-Paper Clip

పాపయ్యపేటలో ఉచిత పశువైద్య శిబిరం:పశువులకు పరీక్షలు, మందుల పంపిణీ

చెన్నారావుపేట నవంబర్ 03 ప్రజావాణి

మండలంలోని పాపయ్యపేట గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బుర్ర సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా చెన్నారావుపేట పీవీసీ పశువైద్యులు డాక్టర్ జునైద్ ఖాన్ మాట్లాడుతూ.. పాడి రైతులు గోపాలమిత్ర సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం పశువుల్లో లింగ నిర్ధారణ వీర్యం (సెక్స్డ్ సెమెన్) అందుబాటులో ఉందని, దీని ద్వారా కృత్రిమ గర్భధారణ చేయిస్తే కేవలం ఆడ దూడలు మాత్రమే జన్మిస్తాయని వివరించారు. ఈ ఆధునిక సాంకేతికతను రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ శిబిరంలో మొత్తం 64 పాడి పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా..ఎదకు రాని 34 పశువులకు ప్రత్యేక చికిత్స చేశారు.24 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించారు.23 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు.2 గేదెలకు కృత్రిమ గర్భధారణ చేయగా, మరో 2 పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ చికిత్సలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ లింగాల సారంగం, జల్లి పీవీసీ డాక్టర్ బి. వెంకటరాజు, గోపాలమిత్ర సూపర్వైజర్ ఎండి. జహంగీర్, జేవీఓ శ్రావణ్, వీఏ వీరులాల్, పంచాయతీ సెక్రటరీ రాజు, గోపాలమిత్రులు అబ్బరపూరి రమేష్, కళ్లెపు ప్రసాద్, బింగి లక్ష్మీనారాయణ, శ్రీకాంత్ మరియు గ్రామ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.