* నేడు రైతు గర్జన… చలో అదిలాబాద్*
——–*నాచుపల్లి నుంచి భారీగా తరలివెళ్లిన బి ఆర్ ఎస్ నాయకులు*
నస్రుల్లాబాద్ నవంబర్ 1 (ప్రజావాణి) నసరుల్లాబాద్ మండల పరిధిలో నాచుపల్లి గ్రామం నుంచి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆదివారము పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. బి ఆర్ ఎస్ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జరుగుతున్న ఈ రైతు గర్జన సభకు తెలంగాణ నాలుగు మూలల నుండి రైతులు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఈరోజు ఉదయం నాచుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కండువాలు వేసుకొని పార్టీ జెండాలతో కార్లలో అదిలాబాద్ బయలుదేరారు జై తెలంగాణ జై జై తెలంగాణ టిఆర్ఎస్ నిదానాలతో మారు మోగింది. టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అఫ్రోస్ మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలిచే ఏకైక పార్టీ బి ఆర్ ఎస్ అని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరి కొనుగోలు, తదితర అంశాలపై రైతుల గలాన్ని వినిపించినట్టు అన్నారు. అదిలాబాద్ సభను విజయవంతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు అప్రోచ్, కీసరి బద్రి, కీసరి భూమయ్య, కుర్మ గంగారం, గైన శీను, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

