📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపేదలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదే

పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదే

📰 Generate e-Paper Clip

పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదే

• భూపంపిణీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు

• సంగారెడ్డిలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో జగ్గారెడ్డి

మన ప్రజావాణి | నవంబర్ 01
సంగారెడ్డి | జిల్లా ప్రతినిధి

దేశంలో పేదలకు భూములు పంపిణీ చేసి, వారి జీవితాలకు భరోసా కల్పించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదేనని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములే నేటికీ అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు భూములు పంపిణీ చేసి, వారి ఆర్థికాభివృద్ధికి ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు. భూములను సాగుచేసుకుంటూ నేటికీ అనేక పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేసిన ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు.

మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీకి ఈ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. సంగారెడ్డిలో ఆమె పాల్గొన్న సభలతో పాటు, ప్రధానమంత్రి హోదాలో జిల్లా పరిషత్ సమావేశంలోనూ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఓడీఎఫ్, బీడీఎల్, ఇక్రిశాట్ వంటి సంస్థల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు.

దేశ భద్రత, సమగ్రత కోసం క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ 1984లో హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల పాలన దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పునాదులు వేసిందన్నారు.

ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల కోసం పనిచేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.