📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణన్యాయ చైతన్యమే విద్యార్థులకు రక్షణ

న్యాయ చైతన్యమే విద్యార్థులకు రక్షణ

📰 Generate e-Paper Clip

న్యాయ చైతన్యమే విద్యార్థులకు రక్షణ

చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య

హైకోర్టు న్యాయవాది ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

బీరంగూడ, అక్టోబర్ 31 (ప్రజావాణి):విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులను తెలుసుకోవాలని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సూచించారు. శనివారం బీరంగూడ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో హైకోర్టు న్యాయవాది ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగ హక్కులు, బాలల రక్షణ చట్టం (పోక్సో), సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు, బాలికల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పౌర బాధ్యతల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. పుస్తక జ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, చట్టపరమైన అవగాహన ఎంతో అవసరమని న్యాయవాది ఐలాపూర్ మాణిక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.