📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబియ్యం విక్రయ ధరలను తప్పనిసరిగా ప్రదర్శించాలి

బియ్యం విక్రయ ధరలను తప్పనిసరిగా ప్రదర్శించాలి

📰 Generate e-Paper Clip

బియ్యం విక్రయ ధరలను తప్పనిసరిగా ప్రదర్శించాలి

జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

బియ్యం విక్రయదారులు తమ విక్రయ కేంద్రాలలో వివిధ రకాల బియ్యం గరిష్ట విక్రయ ధరల వివరాలను ప్రజలకు కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల శ్రీనాథ్ ట్రేడర్స్, హరి ఓం ట్రేడర్స్, మహేశ్వరి ట్రేడర్స్ బియ్యం విక్రయ దుకాణాలను డి.టి., ఆర్.ఐ., ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బియ్యం విక్రయదారులు తమ విక్రయ కేంద్రాలలో వివిధ రకాల బియ్యం గరిష్ట విక్రయ ధరలను తెలిపే ఫ్లెక్సీలను తప్పనిసరిగా ఏర్పాటు చేసి ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలిపారు. బి పి టి బియ్యం కిలోకు 66 రూపాయలు, తెలంగాణ సోనా / హెచ్‌ఎంటి బియ్యం కిలోకు 74 రూపాయలు, జైశ్రీరామ్ బియ్యం కిలోకు 79 రూపాయలకు మించరాదని తెలిపారు. హోల్‌సేల్ వ్యాపారులు, కిరాణా వర్తకులు, మిల్లర్లు, బియ్యం విక్రయదారులు ఈ ధరలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత ధరలకు మించి బియ్యం విక్రయించరాదని సూచించారు వినియోగదారులకు ధరలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా విక్రయ కేంద్రాలలో ధరల పట్టికలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలను ఉల్లంఘించి అధిక ధరలకు బియ్యం విక్రయించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం–1955 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.