📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచింతలపల్లిలో ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

చింతలపల్లిలో ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

చింతలపల్లిలో ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

విద్యార్థుల ఐక్యతే లక్ష్యం..హక్కుల సాధనకు సమష్టి పోరాటం

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించి వారి హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు, జిల్లా నాయకత్వం సూచనల మేరకు ఎల్కతుర్తి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అడ్డూరి అనిల్ మాదిగ, మండల కార్యదర్శి చిలుముల వినోద్ మాదిగ, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు గొల్లమందల చరణ్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎన్నిక నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతూ, విద్యా అవకాశాల సాధనకు, సామాజిక సమానత్వానికి, అణగారిన వర్గాల విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎంఎస్ఎఫ్ వేదికగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో విద్యార్థులను సంఘటితం చేసి ఉద్యమ భావజాలాన్ని విస్తరించడమే నూతన కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

గ్రామ అధ్యక్షుడిగా బొంకూరి దేవ మాదిగ, ఉపాధ్యక్షుడిగా అడ్డూరి సుశాంత్ మాదిగ,ప్రధాన కార్యదర్శిగా చుంచు శ్రీశాంత్ మాదిగ,కార్యదర్శిగా బొంకూరి హర్షవర్ధన్ మాదిగ,కోశాధికారిగా బొంకూరి సాయి రితిక్ మాదిగలను ఎన్నుకున్నారు.
కమిటీ సభ్యులుగా బొంకూరి బాలు మాదిగ,చుంచు ప్రభుతేజ మాదిగ,బొంకూరి అంజి మాదిగ,చుంచు సాహిత్ మాదిగ,చిలుముల సంజయ్ మాదిగ,బొంకూరి వివేక్ మాదిగ,బొంకూరి వికాస్ మాదిగ తదితరులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అడ్డూరి నవీన్ మాదిగ,చిలుముల ప్రమోద్ మాదిగ,బొంకూరి అనిల్ మాదిగ,అడ్డూరి సుధాకర్ మాదిగ,అల్లకొండ మహేష్ మాదిగ,బొంకూరి చందు మాదిగ,బొంకూరి తేజ మాదిగ,బొంకూరి ఉదయ్ మాదిగతో పాటు పలువురు మాదిగ విద్యార్థులు పాల్గొన్నారు.
నూతన కమిటీ విద్యార్థుల ఐక్యతకు కేంద్రంగా నిలుస్తూ,గ్రామంలో విద్యా చైతన్యాన్ని విస్తరించి,విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.