చింతలపల్లిలో ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు
చింతలపల్లిలో ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు విద్యార్థుల ఐక్యతే లక్ష్యం..హక్కుల సాధనకు సమష్టి పోరాటం ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించి వారి హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు, జిల్లా నాయకత్వం సూచనల మేరకు ఎల్కతుర్తి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అడ్డూరి అనిల్...