📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసమ సమాజ నిర్మాణ స్థాపన జరగాలంటే అది కేవలం మహాజన విద్యార్థి సమాఖ్య ఎమ్మెస్ యు...

సమ సమాజ నిర్మాణ స్థాపన జరగాలంటే అది కేవలం మహాజన విద్యార్థి సమాఖ్య ఎమ్మెస్ యు తోనే సాధ్యం

📰 Generate e-Paper Clip

*సమ సమాజ నిర్మాణ స్థాపన జరగాలంటే అది కేవలం మహాజన విద్యార్థి సమాఖ్య ఎమ్మెస్ యు తోనే సాధ్యం*

*వంగూరి ఆనందరావు మాదిగ మారుపే ఎస్ ఎం ఎస్ పి జాతీయ నాయకులు*

*మన ప్రజావాణి ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 31*

నేటి భారతీయ కుల సమాజంలో అంతరాలను అంటరానితనాన్ని కుల వ్యవస్థను తొలగించాలి అంటే అది కేవలం మహాజన విద్యార్థి లోకం తోనే సాధ్యం అవుతుందని అందుకు సమాజంలోని అన్ని వర్గాల ఠవిద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆనందరావు మాదిగ స్పష్టం చేసినారు మహాజన నేత సామాజిక ఉద్యమాల విజయ రథసారథి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన మాదిగ విద్యార్థి సమైక్య ఎమ్మెస్ ఎఫ్ గ్రామ కమిటీల నిర్మాణ సదస్సులలో భాగంగా నేడు నేలకొండపల్లి రామచంద్రపురం గ్రామాలలో గ్రామ కమిటీల నిర్మాణం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా నేలకొండపల్లి పట్టణ కేంద్రంలో టౌన్ కమిటీ అధ్యక్షులు గుండె పొంగు శ్రీకాంత్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆనందరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ విద్యార్థి సమైక్య ఎంఎస్ఎఫ్ ను గ్రామ గ్రామాన బలోపేతం చేయడానికి ఆయా గ్రామాలలోని విద్యార్థులు విద్యార్థినిలు మరియు వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు మాదిగ విద్యార్థి సమైక్య బలోపేతంతోనే మాదిగ విద్యార్థులు విద్యార్థినిలు గాని మహాజన విద్యార్థిని విద్యార్థులు గాని కేంద్ర ప్రభుత్వాలు వారి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న సమస్యల సాధన కోసం బలమైన పోరాటాలు చేయడానికి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసినారు ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగిడి కత్తుల ఏదయ్య మాదిగ విశిష్ట అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థినీ విద్యార్థులు ఏకమైతే సాధించలేనిది ఏదీ లేదంటూ స్పష్టం చేసినారు భవిష్యత్తులో నేటి సమాజంలో బడుగు బలహీనవర్గాల విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన పట్ల మాదిగ విద్యార్థి సమాఖ్య ఎంఎస్ఎఫ్ బలమైన ఉద్యమాలు చేయటానికి వెనుకాడ బోదని అందులో భాగంగా భవిష్యత్తులో మహాజన స్టూడెంట్ యూనియన్ స్థాపించి అన్ని వర్గాల విద్యార్థుల సమస్యల సాధన పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన ఉద్యమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు ఈ గ్రామ కమిటీల సదస్సులలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు పట్టపంచర బాలస్వామి మాదిగ తోళ్ళ వెంకన్న మాదిగ ఎమ్మార్పీఎస్ నేలకొండపల్లి మండల కమిటీ మాజీ అధ్యక్షులు మాదాసు వెంకన్న మాదిగ ఎమ్మార్పీఎస్ నేలకొండపల్లి మండల కమిటీ అధ్యక్షులు వడ్లమడి హనుమంతరావు మాదిగ ఎ ఎమ్మార్పీఎస్ నేలకొండపల్లి మండల కమిటీ ఉపాధ్యక్షులు సురేపల్లి సుందర్ పాల్ మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ టౌన్ అధ్యక్షులుగుండె పొంగు శ్రీను రామచంద్రపురం గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు అశోక్ మాదిగ ఆనందరావు మాదిగ గ్రామ పెద్దలు విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో నేలకొండపల్లి టౌన్ ఎమ్మార్పీఎస్ కమిటీని మరియు మాదిగ విద్యార్థి సమైక్య టౌన్ కమిటీ ల ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది టౌన్ ఎమ్మార్పీఎస్ కమిటీ అధ్యక్షులుగా పగిడి కత్తుల కిరణ్ మాదిగ అధికార ప్రతినిధిగా వెంకటేష్ మాదిగ ప్రధాన కార్యదర్శిగా పగిడి కత్తుల క్రాంతి మాదిగ ఉపాధ్యక్షులుగా బొజ్జ భార్గవ్ మాదిగ కార్యదర్శిగా కడప ఎల్లయ్య మాదిగ సహాయ కార్యదర్శిగా కుక్కల శేఖర్ మాదిగ కోశాధికారిగా కొండ తిరుమల ఉపాధ్యక్షులుగా పైడికత్తుల కళ్యాణ్ మాదిగ లను మరియు మాదిగ విద్యార్థి సమాఖ్య ఎంఎస్ఎఫ్ టౌన్ కమిటీ అధ్యక్షులుగా మాదాసి గణేష్ మాదిగ అధికార ప్రతినిధి పగిడి కత్తుల సాయి మాదిగ ప్రధాన కార్యదర్శిగా కుక్కల వసంత కుమారు మాదిగ ఉపాధ్యక్షులుగా నూకల యశ్వంత్ మాదిగ కార్యదర్శిగా కొండ అరుణ్ మాదిగ సహాయ కార్యదర్శిగా దారెల్లి అక్షయ మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రామచంద్రపురం గ్రామ విద్యార్థి సమైక్య ఎమ్మెస్ ఎఫ్ అధ్యక్షులుగా అఖిల్ మాదిగ అధికార ప్రతినిధిగా సంతోష్ మాదిగ ఉపాధ్యక్షులు రిత్విక్ మాదిగ ప్రధాన కార్యదర్శి నిఖిల్ మాదిగ కార్యదర్శి వెంకటేష్ మాదిగ సహాయ కార్యదర్శి జీవన్ మాదిగ మరియు కమిటీ సభ్యులుగా నివేద మాదిగ మెదరమెట్ల ప్రవీణ్ మాదిగ దేవపంగి వర్షిత మాదిగ నెమలి నిత్య మాదిగ పొట్ట పెంజర సహజ మాదిగ మేదరమెట్ల నిషిక మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.