📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభువనగిరి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం వార్షిక తనిఖీ

భువనగిరి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం వార్షిక తనిఖీ

📰 Generate e-Paper Clip

*భువనగిరి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం వార్షిక తనిఖీ…*

*తనిఖీ నిర్వహించిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31*

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ వార్షిక తనిఖీలో భాగంగా శనివారం రోజు భువనగిరి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయం లోని వివిధ రికార్డులు , రిజిస్టర్లను క్షుణ్ణంగా పరి శీలించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ పిటిషన్లు , ఆర్టీఐ ఫైల్స్ , ఎస్డీపీఓ సందర్శనలు మరియు తనిఖీలకు సంబంధించిన రికార్డులు, గ్రేవ్ క్రైమ్ రిజిస్టర్ , జాతీయ మానవ హక్కుల కమిషన్ , రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని , ప్రతి ఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ క్రమ బద్ధంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ , ఎస్టీ సంబంధిత ఫిర్యాదులు , మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చే పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసు కోవాలని అధి కారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ , కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, కార్యాలయ నిర్వహణలో క్రమశిక్షణ , బాధ్యతా యుతమైన విధానాన్ని పాటించాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. ఈ వార్షిక తనిఖీలో భువనగిరి డీఎస్పీ రవీందర్ , సీఐలు వెంకటేశ్వర్లు , చంద్రబాబు, సూర్య నాయక్ , ఎస్సైలు లక్ష్మీనర్సయ్య , శ్రీశైలం , అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.