నవంబర్ 7న కొత్తగూడ లో జరుగు కామ్రేడ్ పాలడుగు క్రిష్ణ స్మారక బహిరంగ సభ జయప్రదం చేయండి
సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మోటార్ సైకిల్ ర్యాలీ
కొత్తగూడ మండల ప్రతినిధి:- అక్టోబర్ 30. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 1 నుండి 9 వరకు జరుగు అమరవీరుల సంస్మరణ సభలలో భాగంగా, నవంబర్ 7న కొత్తగూడ లో జరుగు కామ్రేడ్ పాలడుగు కృష్ణ స్మారక బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ.. శుక్రవారం రోజున కొత్తగూడా లో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో, మోటార్ సైకిల్స్ ర్యాలీ నిర్వహించ్చారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సూర్యం, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గూడూరు డివిజన్ కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ… దోపిడి, పీడన, అసమానతలు లేని నూతన సమాజం కోసం భారత విప్లవధ్యంలో అమరత్వం పొందిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ… నవంబర్ 1 నుండి 9 వరకు జరుగు సభలను గ్రామ, గ్రామాన విస్తృతంగా జరపాలని కోరుతూ.. నవంబర్ 7న కొత్తగూడ లో జరుగు కామ్రేడ్ పాలడు కృష్ణ స్మారక బహిరంగ సభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పుల్లన్న, శ్రీశైలం, రాజమల్లు, పూర్ణచందర్, బుర్కా బుచ్చి రాములు, గజ్జి సోమయ్య, నిర్మల, ఉడుత వెంకన్న, తాళ్లపెళ్లి ప్రభాకర్, భూక్య శంకర్, మోహన్, బిచ్చు, రామచంద్రు, రాజా, మద్దెల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

