భూ భారతి…. భూ సర్వేతో రైతుల భూములకు శాశ్వత పరిష్కారం
హుస్నాబాద్ అర్ డి ఓ వాసం రామ్మూర్తి
మద్దూరు అక్టోబర్29, ప్రజా వాణి,
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ భారతి భూ సర్వేతో రైతుల భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హుస్నాబాద్ అర్ డి ఓ వాసం రామ్మూర్తి అన్నారు. గురువారం మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య అధ్యక్షతన రైతులతో ఏర్పాటు చేసిన భూ భారతి భూ సర్వే సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఒకప్పుడు రైతులు భూముల పట్టాల కోసం కార్యాలయం చుట్టు తిరిగే వారు అయిన కొన్ని సందర్భాల్లో పనులు కాకపోవడంతో రైతులు ఆర్దికంగా చాల నష్ట పోయిందన్నారు.ప్రస్తుతం ప్రభుత్వం భూ యాజమానుల వద్దకే వెళ్లి భూ సమస్యలను పరిష్కరించే విధంగా భూ భారతి భూ సర్వే అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టి వివాదాలు లేని భు రక్షణ చట్టం కోసం అధికారులను నేరుగా గ్రామాలకు పంపడం మన అదృష్టమన్నారు అదృష్టమన్నారు.జిల్లాలో 380 గ్రామాలుండగా కేవలం ధర్మారం గ్రామంలోనే సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.103 సంవత్సరాల క్రితం జరిగిన సర్వే అనంతరం గ్రామాలు,రోడ్లు, భూములు, ప్రజల సంఖ్య పెరగడంతో కొత్త మ్యాపు కోసం ప్రభుత్వం రీ సర్వే చేస్తుందని రైతులు ఈ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే ఏ డి సుదర్శన్, తహసీల్దార్ ఏ. జి రహీమ్, అర్ ఐ కృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి మధుసూదన్, ఆయా గ్రామాల జి పి ఓలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

