📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

సమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

*సమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యార్థుల సమక్షం లో ప్రముఖ రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఈ నెల 31వ తేదీ శనివారం హైదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న సమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువతలో సాహిత్యాభిరుచి, సృజనాత్మకత, భావవ్యక్తీకరణను పెంపొందించడంలో ఇటువంటి సాహిత్య వేడుకలు కీలకమని పేర్కొన్నారు. సాహిత్యాభిమానులు, యువ రచయితలు, మిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సాహిత్య వేడుకను విజయవంతం చేయాలని సమూహ నల్లగొండ జిల్లా కన్వీనర్ ప్రభాకర్ కస్తూరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పగడాల నాగేందర్, మోత్కూరు శ్రీనివాస్, తెలుగు శాఖ అధ్యాపకులు సందేనబోయిన ప్రభాకర్ డాక్టర్ టంగుటూరి సైదులు, దండి అంజయ్య, మామిడి లింగస్వామి, కట్ట శ్రవణ్ కుమార్, వనజ, బి. చిట్టెమ్మ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.