📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

📰 Generate e-Paper Clip

*పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్*

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అమరావతి అక్టోబర్ 26

*స్థానిక ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం*

*’చెప్పాం-చేస్తున్నాం’ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని టీడీపీ అధినేత ఆదేశం*

*మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేనని స్పష్టం*

*టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…*

• 2024 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రచారానికి ప్రజల వద్దకు వెళ్తున్నాం.
• ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి.
• 2024 ఎన్నికల్లో లభించిన అద్భుత విజయం తర్వాత… ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ వస్తున్నాం.
• 151 సీట్లతో గెలుపొంది అరాచకాలు చేసిన గొడ్డలి పార్టీకి కేవలం 11 సీట్లే ఇచ్చి నాడు ప్రజలు తిరుగుబాటు చేశారు.
• కూటమి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
• ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నాం.
• రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ… ప్రతి ప్రాంతానికీ లబ్ది చేకూర్చేలా పాలన సాగిస్తున్నాం.
• రికార్డులు సృష్టించేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.
• కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
• ఎన్నికల్లో చెప్పినవన్నీ చేస్తున్నాం… అందుకే ‘చెప్పాం-చేస్తున్నాం’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలి.
• స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేశాం… చిన్న కులాలకు కూడా ప్రాధాన్యతనిచ్చాం.
• పాలనలో తామూ భాగస్వాములమనే సంతృప్తి ప్రతి ఒక్క వర్గానికి కలగాలి.
• ప్రభుత్వానికి… ప్రజలకు కూటమి పార్టీల కార్యకర్తలే వారధిగా నిలవాలి.
• కూటమి పార్టీలు చక్కటి సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పని చేయాలి.
• మిత్రధర్మాన్ని తప్పకుండా పాటించాల్సిందే. ఇందులో ఎలాంటి వెసులుబాటూ లేదు.
• మూడు స్థాయిల్లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే కలిగే లాభాలను వివరించాలి.
• అగ్ర నేతలు మొదలుకుని… కార్యకర్త వరకు చేసే పనిని రికార్డ్ చేస్తున్నాం.
• పొత్తుల కారణంగా… రిజర్వేషన్ల కారణంగా… సోషల్ రీ-ఇంజనీరింగ్ లో భాగంగా కొంత మందికి అవకాశాలు దక్కలేదు.
• రాష్ట్రం, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపునిస్తాం. నామినేటెడ్ పదవులతో గౌరవిస్తాం.
• ప్రభుత్వం చేసే మంచిని వివరించడంతోపాటు… గొడ్డలి పార్టీ చేసే అరాచకాల పైనా ప్రజలను అప్రమత్తం చేయాలి.
• గొడ్డలి పార్టీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలి.
• గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడు.. కుటుంబ బంధాలనూ పట్టించుకోడు.
• వార్డూ… డివిజన్ మొదలుకుని ప్రతి స్థానంలోనూ కూటమి పార్టీల జెండాలు ఎగరాల్సిందే.
• కూటమి పార్టీలకు పాజిటివ్ ఓట్లు పడాలి… కూటమికి పాజిటివ్ ఓటు బ్యాంకు మరింత పటిష్టం కావాలి.
• ప్రతి ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసేలా చూడాలి.
• ప్రతి పోలింగ్ బూత్ లోనూ 2024 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు పడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.