📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణయాసంగి 2026–27లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

యాసంగి 2026–27లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

*యాసంగి 2026–27లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచనల మేరకు, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు విత్తనాల డీలర్లు, మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల డీలర్లతో యాసంగి సాగు సలహాలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. జొన్న, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, శనగ, కుసుమ వంటి ఆరుతడి పంటలతో పాటు కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకొని రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్కెట్లో ఆరుతడి పంటలకు మంచి ధరలు లభించే అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లకు సూచనలు:

రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలను అందించేందుకు డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

– నకిలీ విత్తనాలను విక్రయించరాదు. అనుమతులు కలిగిన, లేబుల్‌పై అవసరమైన వివరాలు ఉన్న విత్తనాలను మాత్రమే విక్రయించాలి.
– విత్తనాలను ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ చిల్లర ధర (MRP) కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదు.
– కాలపరిమితి ముగిసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదు.
– విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నిల్వలు, విక్రయాలు మరియు సంబంధిత రికార్డులను నిబంధనల ప్రకారం నిర్వహించాలి.
– రైతులకు సరైన వ్యవసాయ సూచనలు అందిస్తూ నాణ్యమైన ఉత్పాదకాలను సరైన ధరలకు అందుబాటులో ఉంచాలి.

రాబోయే యాసంగి సీజన్‌లో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు ఆర్థికంగా లాభపడేలా వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు డీఆర్‌డీఓ అధికారి నూరుద్దీన్, జనగామ, ఘనపూర్ (స్టేషన్), పాలకుర్తి ఏడీఏలు అపర్ణ, వసంత సుగుణ, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల మహిళా డీలర్లు, 190 మంది ప్రైవేటు విత్తన డీలర్లు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.