యాసంగి 2026–27లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి
*యాసంగి 2026–27లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచనల మేరకు, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు విత్తనాల డీలర్లు, మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల డీలర్లతో యాసంగి సాగు సలహాలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. జొన్న, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, శనగ, కుసుమ వంటి...