📄 ePaper
Epaper 2
Friday, October 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపికకు రంగం సిద్ధం

పెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపికకు రంగం సిద్ధం

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపికకు రంగం సిద్ధం

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపికలు.. అర్హులైన క్రీడాకారిణులు హాజరుకావాలి

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మహిళా కబడ్డీ క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకోవాలని ఆయన కోరారు.

ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారిణులు తప్పనిసరిగా 75 కిలోల లోపు బరువు కలిగి ఉండాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే వారు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, పదో తరగతి ఒరిజినల్ మెమోను వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత సమయానికి ఎంపికల కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పెద్దపల్లి జిల్లా తరఫున పాల్గొంటారని కరుణాకర్ రెడ్డి తెలిపారు.

జిల్లాలో కబడ్డీ క్రీడపై ఆసక్తి కలిగిన మహిళా క్రీడాకారిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎంపికల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

**మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు: 9908133143**

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.