📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవృద్ధుల సంక్షేమానికి బాల వికాస బాసట

వృద్ధుల సంక్షేమానికి బాల వికాస బాసట

📰 Generate e-Paper Clip

వృద్ధుల సంక్షేమానికి బాల వికాస బాసట

సేవా కార్యక్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు,దుస్తుల పంపిణీ

బెజ్జంకి, అక్టోబర్ 23 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం క్రాసింగ్ గ్రామంలోవృద్ధుల సంక్షేమానికి అండగా నిలుస్తూ, వారి జీవితాల్లో భరోసా నింపేందుకు బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు, దుస్తులను బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమం, సామాజిక భద్రతపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని నిర్వాహకులు పేర్కొన్నారు.వృద్ధులకు అండగా నిలిచే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాజ రవళి, బాల వికాస నిర్వాహకులు అన్నా మేరీ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.