📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బొక్క విష్ణువర్ధన్ రెడ్డి

బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బొక్క విష్ణువర్ధన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొంటూ, ఈ పండుగ ప్రజల జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బొక్క విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నాయకులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పండుగలు ప్రజల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. దసరా సందర్భంగా కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.