📄 ePaper
Epaper 2
Friday, October 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘనంగా ఘనపురంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం ...ముఖ్య అతిధి గా పాల్గొన్న వేముల మమత...

ఘనంగా ఘనపురంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం …ముఖ్య అతిధి గా పాల్గొన్న వేముల మమత మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్, చైర్మన్, మాజీ సర్పంచ్ వేముల మమత మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి నిర్వహించిన అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బద్దం గోపాల్ రెడ్డి, వేముల సంజీవ గౌడ్, మాజీ ఉపసర్పంచులు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, బోనకుర్తి అర్జున్, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, వేముల యాదగిరి గౌడ్, వేముల శ్రీనివాస్ గౌడ్, వేముల మహేశ్వర్ గౌడ్, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు వేముల వినోద్ గౌడ్, నాయకులు వేముల కేశవనాధం గౌడ్, వేముల కుమార్ గౌడ్, మంతెన సాయి రెడ్డి, కట్కూరి భాను గౌడ్, వేముల పవిత్రన్ గౌడ్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.