బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బొక్క విష్ణువర్ధన్ రెడ్డి
ఘట్‌కేసర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొంటూ, ఈ పండుగ ప్రజల జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బొక్క విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర...